పూర్వము, సుమారుగా 200 సం క్రితం, కర్ణాటక రాస్ట్రం, విజయనగర సంస్థానాధీశులు, కృష్ణదేవరాయలు ఆస్థానము నందు, చిత్ర కళాకారుడు, చిత్తర్వు బిరుదాంకితులు, చిత్తర్వు వెంకోజి గారు, సంస్థానం పతనమయిన పిమ్మట, వారు మామిడికోళ్ళ గ్రామానికి వలస వచ్చినారు (సుమారుగా 6 తరముల క్రింద). వారు కరకట్ట కాంట్రాక్ట్ లు బ్రిటిష్ వారి హయాములో చేసుకొనుచు, సంపాదించుకొనుచు, తోడు కోసం, పెరిసేపల్లి గ్రామము నుండి, తోట వారిని తీసుకుని వచ్చినారు. చిత్తర్వు వారు 1911 వ సం నుండి 1918 వ సం వరకు మేడ కట్టుకుని, తోట వారు మండువ లోగిలి కట్టుకుని ఉంటూ ఉండేవారు.
ఈ మామిడికోళ్ళ గ్రామము, కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలము నందు, పామర్రు నుండి గుడ్లవల్లేరు వచ్చు పుల్లేరు కాలువ గట్టు ప్రక్కన, గుడ్లవల్లేరు నుండి 4 కిమీ దూరమున ఉన్నది. మరియు ఇటుగా వయా లంకాదొడ్డి గ్రామము మీదుగా డోకిపర్రు వేంకటేశ్వర స్వామి గుడి (7 కిమీ) నకు రోడ్డు అనుసంధానమై ఉన్నది.
మామిడికోళ్ళ గ్రామమున 2010 వ సం నందు శ్రీ వీరమ్మ తల్లి అన్న సమారాధన కమిటీ ఏర్పడి, శ్రీ వీరమ్మ తల్లి సందర్శించు భక్తులకు ఎంతమంది వచ్చినను ఆ రాత్రి భోజన సదుపాయం లేదని అనకుండా అన్నదానము (భక్తుల విరాళాల తో) చేయుచున్నారు. 1100 మందితో ప్రారంబించబడి ఇప్పటి వరకు (2020, 2021 మినహా, కరొన సందర్బంగా) అప్రతిహారంగా సుమారుగా 4000 మంది భక్తులు భోజనాలు చేయుట జరుగు చున్నవి.
ఈ క్రమమున 2022 వ సం నుండి, భక్తులకు ఉదయము అల్పాహారము, మధ్యానం భోజనము కూడా కమిటీ వారు భక్తుల విరాలము లతో సమకూర్చు చున్నారు. కావున, భక్తులు ఉదయము నుండి తల్లిని దర్శించుకుని భోజనాది సదుపాయములు ఉపయోగించుకొనవచ్చును. ఈ కార్యక్రమములు వీక్షించుటకు క్రింది వెబ్ సైటు ను చూడండి.
https://www.youtube.com/watch?v=FWs4KzOuN-o
శ్రీ వీరమ్మ తల్లి గుడి కట్టి, 100 సం దాటిన సందర్బమున, ఊరి ప్రజలు, కమిటీని ఏర్పాటు చేసుకుని, నూతన గుడి అమ్మ వారికి (గుడి పునః నిర్మాణం) కట్టించటము జరుగు సందర్బంగా, 10-ఆగస్టు-2024 న గం 9.26 ని లకు శంకుస్థాపన భక్తుల విరాళములతో చేయడం జరిగినది. విరాళముల సమాచారం, కమిటీ వారు ఎప్పటికప్పుడు వాట్సప్ ద్వారా తెలియ పరచడం జరుగు తున్నది.
కావున శ్రీ వీరమ్మతల్లి గుడి పునః నిర్మాణం నకు దాతలు విరాళములు ఇవ్వడానికి, బ్యాంక్ ఖాతా నెంబర్ మరియు క్యూ. ఆర్. కోడ్ సమాచారము:
ఎవరైనను, ఎంత మొత్తమయినను, విరాళములు ఇచ్చు వారు, క్రింద తెలియ బర్చిన సమాచారం ప్రకారం, అన్న సమారాధన కమిటీ ని కూడా సంప్రదించ వచ్చు.
శ్రీ దేవుడు భద్రయ్య గారి వంశస్థులు రోజు క్రమం తప్పకుండా
• శ్రీ వీరమ్మ తల్లి కి దూప, దీప, నైవేద్ధ్యం పెట్టుట.
• బయట ఊరి భక్తులు వచ్చిన యెడల వారికి ఆహ్వానించి, వారు చేయు పూజ కార్యక్రములకు (పాలు పొంగించుకొనుట, పాల పొంగుళ్ళు చేయుట, కొబ్బరి కాయ కొట్టుట, పసుపు, కుంకుమ పెట్టుట, కోడి, మేక, పొట్టేలు ను బలి యిచ్చుట మొదలగునవి, ఎవరు అనుకొన్నవి వారు చేయుదురు) తోడ్పాటు
• పొయ్యి, గ్యాస్, వంట పాత్రలు, కుర్చీలు మొదలగునవి సమకూర్చుట
• శ్రీ వీరమ్మ తల్లి బండారి, తాళ్ళు ఇవ్వడం
శ్రీ దేవుడు భద్రయ్య గారు చీర నందు
గ్రామ పెద్దల సమాచారం ప్రకారం, శ్రీ వీరమ్మ తల్లి పూనకము నందు ప్రతి సంవత్సరము శ్రీ రామ నవమి తరువాత వచ్చు శుక్రవారము సంబరాలు నిర్వహించమని చెప్పినందు వలన, పెద్దల ఊహ తెలిసిన నాటి నుండి ప్రతి సంవత్సరము ఆ విధము గానే తల్లి సంబరములు జరుగు చున్నవి.
గ్రామ పెద్దలు చెప్పిన ప్రకారం, ఎవరైనను సంబరం రోజున మ్రొక్కులు తీర్చుకోలేక పోయిన, ఏ కారణం చేత రాలేక పోయిన వారు, సంబరం శుక్ర వారం నుండి, నాల్గవ శుక్రవారం (నెల సంబరం అని పిలుచుదురు) రోజున, వారు గద్దె కు వచ్చి, వారి యొక్క మ్రొక్కులు తీర్చుకొంటారు. ఇది సంబరం రోజు తీర్చుకొను మ్రొక్కులతో సమానం.